Facebook Twitter
కరోనా..కాలసర్పం....

కరోనా కరోనా కరోనా
ఎక్కడ చూసినా కరోనా
ఎవరి నోటవిన్నా కరోనా
అన్ని దేశాలల్లో దూరేనా
జనానికి జనం తాకినా
జనానికది సోకినా
కడకు అందరు కాటికి చేరేనా
కరోనా అంటేననే
కరెంట్ షాక్ కు గురైనట్లు
కలవరపడి పోతున్నారే
ఆ పేరు వింటేనే, గుండెదడ పుట్టి
ప్రజలూ గజగజ వణికి పోతున్నారే
జలుబు, జ్వరం, దగ్గు వచ్చినా
ఊపిరాడకపోయినా ప్రజలు
ఉలిక్కిపడుతున్నారే, ఉక్కిరిబిక్కిరౌతున్నారే
గుండెలు పిండేసే వార్తలు వింటూ
గుప్పెట్లో ప్రాణాలు పెట్టుకొని
ప్రయాణాలు వాయిదా వేసుకొని
వర్క్ ఫ్రం హోం అంటూ ఇంటికే
పరిమితమై ,దిక్కుతోచక, జనం
బిక్కుబిక్కుమంటూ, భయంభయంగా
దినదిన గండంగా బ్రతుకుతున్నారే
కారణం ఒక్కటే చైనా నుండి దిగుమతిఐన
కంటికి కనిపించక కాలసర్పమై
కాటు వేస్తున్నకాటి కీడుస్తున్న
మాయదారి కరోనా మహమ్మారే
అందుకే,ముఖానికి మాస్కులు వేసుకుందాం
సోపుతో చేతులు శుభ్రం చేసుకుందాం
క్వారెంటైన్లలో వుందాం, స్వీయ నియంత్రణను,
సోషియల్ డిస్టెన్స్ ను,లాక్ డౌన్ నూ,పాటిద్దాం
అందరం ఇళ్ళలోనే బంధీలైపోదాం,
ప్రభుత్వాలకు సహకరిద్దాం, కరోనాను కట్టడి చేద్దాం
కరోనాకి మందు కనిపెడదాం కరోనాను బొందపెడదాం
కోరలు చాసే ఈ కరోనాను అందరం కలిసి అంతం చేద్దాం