ఆ బిడ్డలనిస్తే చాలు....
ఓ భగవంతుడా !
మాకు
ఖరీదైన కార్లు వద్దు
కోట్ల కోట్ల ఆస్తి వద్దు
పట్టు వస్త్రాలు వద్దు
మేడలు మిద్దెలు వద్దు
విలాసవంతమైన విల్లాలు వద్ధు
బంగారు ఆభరణాలు వద్దు
వినయ విధేయతలు గల
భయము భక్తి గల
నీతి నీజాయితీ గల
తల్లి తండ్రులంటే
ప్రేమ అభిమానం గౌరవంగల
బిడ్డలనివ్వండి చాలు
ఆ బిడ్డలనిస్తే అన్నీ ఇచ్చినట్లే



