నవవధువు నా కవిత
నవవధువుకు ఏది అందం?
చేతికి గాజులు అందం
పాదాలకు పారాణి అందం
ముక్కుకు ముక్కెర అందం
నడుముకు వడ్రాణం అందం
బుగ్గన చుక్క అందం
కాలికి మువ్వలు అందం
సిగలో సిరిమల్లెలు అందం
కాలివేళ్లకు మెట్టెలు అందం
కట్టిన పట్టుచీరలు అందం
పెట్టిన బంగారు నగలు అందం
పెళ్లిలో అందరికీ పరమానందం
ఆమెఅలంకరణ అందానికే అందం
వధువుపెళ్లివేడుకకే అంతులేనిశోభ
వరుడికి మాత్రం కొండంత ఆనందం
నవవధువు పెళ్లి పీటలకే అందం
పెళ్లి పందిరికే అందంశోభనం గదికే అందం
నవవరునికి కలలో...కౌగిలింత
ఊహల్లో...ఊరింత మనసులో...పులకింత
ఒళ్ళంతా...తుళ్ళింత
అయ్యో పాపం వచ్చేస్తోంది...ఆవులింత
ఏ ముత్తైదువుకైనా నుదుట
దిద్దిన కుంకుమతిలకమే... అందం
ఏ పత్రికకైనా సాహిత్యం పేజే...అందం
ఏ కవితకైనా చక్కని సందేశమే...ఆభరణం



