Facebook Twitter
ఆ చల్లని చిరుగాలి అని అడగాలి

అదిగో అదిగో
వీస్తున్నది..! వీస్తున్నది..!

ఓ చిరుగాలి..!
ఓ చల్లని చిరుగాలి..!
ఓ పచ్చని పైరగాలి..!

ఆగాలి...ఆగాలి...
ఆ చిరుగాలిని అడగాలి...
ఉదయం పూట వచ్చే...
ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని తెచ్చే...
ఆ చల్లని చిరుగాలిని అడగాలి..!

సాగాలి...సాగాలి...
సాయంకాలం వచ్చే...
సంతోషాలను సంబరాలను తెచ్చే...
ఆ పచ్చని పైరగాలిని అడగాలి..!

తిరగాలి...తిరగాలి...
ఆ చల్లని గాలిలో తిరగాలి
సంతోష సాగరాలను ఈదాలి..!

తిరుగుతూ తిరుగుతూ ఆగాలిలో
ఊగాలి...ఊగాలి...ఉత్సాహంతో
ఉయ్యాల జంపాలలూగాలి..!

అడగాలి...అడగాలి...
ఆ చల్లని చిరుగాలిని అడగాలి
ఓ చిరుగాలీ..! ఓ చిరుగాలీ..!
ఎందుకు వస్తున్నావని..?
ఎటు నుంచి వస్తున్నావని..?


ఏమి తెస్తున్నావని..?
తెచ్చి మాకేమి ఇస్తున్నావని..?
ఎవరు నిన్ను పంపారని..?
ఏ దివ్యశక్తిని నీలో నింపారని..?

గాలేదైనా దాని గమ్యమేదైనా
తెలుసుకోవాలి వీచే ప్రతిగాలి...
అందించే ముచ్చటైన మూడువరాలు
ఆరోగ్యం...ఆనందం...ఆయుష్షని...

అది మన
శరీర రుగ్మతలకు...
మానసిక వ్యధలకు...
మానని గాయాలకు...మత్తుమందని...

అందుకే మ్రోగాలి...మ్రోగాలి...
ఈ చల్లని చిరుగాలి సందేశం...
జేగంటలాగ...జయభేరిలాగ...
జనానికి వినిపించేలా...
జగమంతా ప్రతిధ్వనించేలా...