ఆయుష్మాన్ భవా...!
ఔను బిడ్డలారా..!
మీ అభివృద్ధిని చూసి
ఎందరో చప్పట్లు కొడతారు
మీరు గర్వంగా గౌరవంగా
ఈ సభ్యసమాజంలో బ్రతకటానికి...
మీరు కలనైనా ఊహించని
ఈ ఉన్నతస్థితికి మీరు చేరడానికి...
ఎన్నో అవమానాలను భరించిన...
ఎన్నోసార్లు కటిక చీకట్లో కన్నీరు కార్చిన... ఎన్నో రాత్రులు అర్ధాకలితో నిద్రపోయిన... కన్నుమూసి కాటికెళ్ళేంతవరకు
మీ బంగారు భవిష్యత్తుకై
ఎన్నో కమ్మని కలలు కంటూ...
మీకు చేయూతనిచ్చే
ఆయుష్మాన్ భవా అంటూ...
అదృశ్యంగా దీవించే
మీ అమ్మానాన్నల్ని...మీరు కలనైనా
మరువకండి..! నిత్యం గుర్తుంచుకోండి..!



