స్వార్థమే జీవిత పరమార్థమా..?
కష్టం వస్తే అది నీదే
నీవే అనుభవించాలి
కష్టానికి ప్రతిఫలం
కన్నీరైతే అవి నీవే త్రాగాలి...
కానీ నీ శ్రమకు ప్రతిఫలం
అంబరాన్ని తాకే సంబరమైతే
ఆ సంతోషామృతాన్ని
అందరం సమిష్టిగా పంచుకోవాలి ఆనందంతో గంతులు వేయాలి తన్మయత్వంతో నృత్యం చేయాలి
ఇదే స్వార్ధం...ఇదే స్వార్ధం...
ఇది కారాదు నీ జీవిత పరమార్థం...
ఔను
ఆపదలో
ఆదుకున్నోడే...
ఆపద్బాంధవుడు...
దయార్ద్రహృదయుడు...
దానకర్ణుడు దైవస్వరూపుడు...
అత్యవసరం పీక పిసికే వేళ
ఎదకు హత్తుకున్నోడే"మనోడు"
దూరంగ ఉన్నోడు "దుష్టుడే"
ఎదుటివారు ఇరుగుపొరుగువారు
ఊపిరాడని ఇబ్బందుల్లో ఉంటే
చేయగలిగి సహాయం చేయనివాడు కొంచమైనా కనికరం జాలిలేని కసాయి
పాపాత్ముడు...పాశాణహృదయుడు
ఆ పరమాత్మకు...వాడు పరమ శత్రువు



