Facebook Twitter
గుబులు రేపే గులాబి(ముల్లు)

విరితోటలో
విరబూచి
మనసును దోచే
మరులు గొలిపే
రంగు రంగుల
కుసుమాలెన్ని ఉన్నా
గుభాళించే ఆ గులాబి
అందచందాలే వేరయా...

తన తలను త్రుంచి
తలలో తురుముకొనేవారి
కాళ్ళళ్ళో వణుకు పుట్టిస్తుంది...
గుండెల్లో గుబులు రేపుతుంది...
కళ్ళలో కన్నీరును తెప్పిస్తుంది...

ఆకు మాటున...
పువ్వు చాటున...
దాగిన ఆ గులాబి ముల్లు
గుచ్చుకున్న చాలు
చిందుతుంది...రక్తం...అందుకే
...అందమైన ఆ గులాబీకి...
...ఆకు చాటున దాగిన ఆ "ముల్లే" ధైర్యం...

ఔను కొందరు
తన కోపమే తన శత్రువంటారు
కోపిష్టులకు "ప్రేమ" సైతం ఎక్కువంటారు
కొందరు కళ్ళెర్రజేసి కస్సుబుస్సుమంటారు
కళ్ళముందే మంచుముక్కలా కరిగిపోయే
‌‌...ముక్కుమీది కోపం ఆముఖానికే అందం...