Facebook Twitter
మీరే విజ్ఞానజ్యోతులు..! విశ్వవిజేతలు..!!

మీరు మీ...
కన్నీళ్ళని నమ్ముకోకండి..!
వాటికి "మీ కంటిచూపు"
విలువ తెలియదు

మీరు మీ...
భయాలను నమ్ముకోకండి..!
వాటికి "మీ బలం సామర్థ్యం" తెలియదు

మీరు మీ బలహీనతలకు...
మీ పిరికితనానికి..‌.మీ గుండె ధైర్యాన్ని
అమ్ముకోకండి..! ...
దానికి మీ "పోరాటపటిమ" తెలుసు...

ఆ పోరాటంలో...
మీకు విజయమో వీరస్వర్గమో తెలుసు....
విజయలక్ష్మిని మీరు వరించడం తెలుసు...
కీర్తికిరీటాలను మీరు ధరించడం తెలుసు...

మీరు మీ...
"విజ్ఞానాన్ని" నమ్ముకోండి..!
అది మీ జీవితంలో
"విజ్ఞాన జ్యోతులను" వెలిగిస్తుంది..!
అది మిమ్మల్ని "విశ్వవిజేతలను"చేస్తుంది..!

అందుకే
ఓ నా ప్రియమిత్రులారా..!
మీరు దేన్నీ నమ్ముకోవాలో..!
దేన్నీ అమ్ముకోవాలో ముందు తేల్చుకోండి..!