నేను Friends Fortune Constructions Co ఓనర్ని నాకు మితృలు శత్రువులు ఇద్దరూ సమానంగా ఉన్నారు అందుకే నేను ఒక కుక్కను పెంచుకుంటున్నాను ఒక వాచ్ మ్యాన్ కూడా ఉన్నాడు
మా కుక్క ముద్దుపేరు పప్పీ అది ఒక తిండిబోతు దానిదో విచిత్ర లక్షణం కొత్త వారెవరైనా కనిపిస్తే పగటిపూట అరుస్తుంది కరుస్తుంది రాత్రి పూట మాత్రం మౌనంవహిస్తుంది
ఎందుకో అర్థం కావడం లేదు
పప్పీని ప్రతిరోజూ నాతో పాటు కార్లో పార్క్ కి తీసుకెళ్ళాలి కాస్ట్లీసోప్స్ తో ఉదయం సాయంకాలం స్నానం చేయించాలి మూడుపూటల పుష్టికరమైన ఆహారం అందించాలి మంచి డ్రెస్ వెయ్యాలి మంచి Perfume కొడితే గాని అది మాటవినదు లేదంటే అల్లరి తెగ చేస్తుంది అది పగటి పూట మాత్రమే
అది అంటే నాకు వల్లమాలిన ప్రేమ నేను ఇంటికి రాగానే నా కాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటుంది ముఖంలో ముఖం పెడుతుంది మూతి నాకుతుంది ముద్దు పెడుతుంది అప్పుడప్పుడూ నాప్రక్కలోనే పడుకుని నిదురపోతుంది ఐతే చిన్నసవ్వడైనా సరే దిగ్గున లేస్తుంది
అరచి అల్లరి చెయ్యదు కాని కళ్లింత చేసి కొరకొరచూసి కంగారు పెడుతుంది దాని పదునైన పళ్ళు చూపించి వచ్చిన వారిని భయపెడుతుంది పారిపోయేలా చేస్తుంది
ఆకలివేస్తేనే అరుస్తుంది అదీ పగలు మాత్రమే రాత్రిపూట మౌనంగా ఉంటుంది అదే నాకు అర్థం కావడం లేదు అదే నాబాధ కూడ
ఎవరైనా దొంగ ఇంటికి వస్తే అరవదు కరవదు కాని పొరపాటునఎప్పుడైనా ఎవరైనా గోడదూకి వస్తే మాత్రం వారిని మౌనంగా వెంటాడి వెంటాడి వేదించి భయపెట్టి పరుగెత్తించి పారిపోయేలా చేస్తుందని చెబుతాడు మా వాచ్ మ్యాన్
అది అరవడంలేదని కరవడంలేదని దానిమీద నాకు పిచ్చి కోపం కాని రాత్రిపూట అది అరిస్తే నాకు నిద్ర పట్టదు అందుకేనేమో అది అరవడంలేదని నా అనుమానం. ఒకసారి అలా అరిచి
నాచేత బెల్టు దెబ్బలు తిన్నది కూడా
ఎందుకో ఒక రోజు అర్థరాత్రి అలసిపోయి వచ్చి తిండిబోతు పప్పిని తిట్టుకుంటూ పడుకున్నాను
తెల్లవారి చూడగానే నాపప్పి రక్తపు మడుగులో గిలగిలా కొట్టుకుంటుూవుంది వెంటనే కార్లో హాస్పిటల్ తీసుకెళ్ళాను కాని పప్పి నాకు దక్కలేదు రాత్రి ఏమి జరిగిందని వాచ్ మాన్ ని అడిగితే అర్ధరాత్రిలో నాపడకగదికి దగ్గరలో ఏదో శబ్దం వచ్చిందని చెప్పాడు.
CCTV ఫుటేజీలు చూసి నివ్వెర పోయాను నా Business Partner నా opponent ఒకడు లోపలికి వస్తుంటే నా పప్పి వాణ్ణి సైలెంటుగా అడ్డుకుంది వాణ్ణి లోపలికి రాకుండా గట్టిగా ప్రతిఘటించింది వాడి మీదకు దూకి గోళ్లతో రక్కింది అంతే ఏమి చెయ్యాలో అర్థం కాక వాడు పప్పీని రివాల్వర్ తో కాల్చి పారిపోయాడు
అదే నాపప్పి వాణ్ణి అడ్డుకోకపోయివుంటే అదే రివాల్వర్ కి నేను తప్పకుండా బలైపోయి ఉండేవాణ్ణి
నాపప్పి తిండిబోతని ప్రతి రోజూ తిట్టుకునేవాన్ని అరవదని కరవదని ప్రతి రోజు కసురుకునేవాన్ని కానీ ఇలా నా కోసం తన ప్రాణాలను ఫణంగా పెడుతుందని నేను కలలో కూడా వూహించలేదు
దాని త్యాగం గుర్తుకు వస్తుంటే నా గుండె తరుక్కు పోతుంది కన్నీళ్ళు ఆగడంలేదు దాని రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థంకావడం లేదు
అందుకే ఓపది లక్షలు బ్యాంకులో డిపాజిట్ చేసి వచ్చే వడ్డీతో సాహస వీరులైన చిన్నారులకు ప్రతి సంవత్సరం
పప్పీ పేరున పది బంగారు పతకాలు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. దీంతో నాప్రియమైన పప్పీ ఆత్మ తప్పక శాంతిస్తుందని ఆశిస్తున్నాను



