1. ప్రేమకు అర్థం..?
ప్రేమకు అర్థం
తెలియదంటే...
..."బచ్ఛా"...అంటారు
ప్రేమించిన
పిల్లనే పెళ్లాడితే
..."అచ్ఛా"...అంటారు
లక్షలకాశ పడి
మోసం చేస్తే
వాడికేమైనా లక్ష్మీ
..."పిచ్చా"...అంటారు
తియ్యని తేనియలు చిలికే..!
కవిపోలన్న కమ్మని పలుకే...!
2. కాలుజారినా..?కడుపు పండినా..?
సిగ్గులజ్జా లేక బాయ్ ఫ్రెండ్స్ తో
బజార్లో బరితెగించి తిరిగినా...
కన్నవాళ్ల కళ్లు
గప్పి కాలు జారినా...
కల చెదిరినా...
కడుపు పండినా...
బ్రతుకు చితికేనమ్మ...
ఓ బంగారు చెల్లెమ్మ...
తియ్యని తేనియలు చిలికే..!
కవిపోలన్న కమ్మని పలుకే...!
3. కళ్లు పొరలు కమ్మితే..?
కళ్లు పొరలు కమ్మితే...
ముందుజీవితం ముక్కలేర...
అక్కలతో ఏలరా ?
అక్రమసంబంధం ఓ కుక్కల్లారా...
వావి వరుసలులేని మీ
కన్న ఆ వరహాలే మిన్న గదరా...
తియ్యని తేనియలు చిలికే..!
కవిపోలన్న కమ్మని పలుకే...!
4. మరణశిక్ష...మాయని మచ్చ...
క్షణికావేశానికి బలైనా...
తప్పు వయసుదైనా...
మరణశిక్ష...మనసుకేరా...
మాయనిమచ్చ...మనిషికేరా...
రక్తసంబంధాలతో రహస్యంగా...
రాసక్రీడలాడేవాడు రాక్షసుడేగదరా...
ముద్దు
మురిపాలు పంచే
ముక్కుపచ్చలారని
పసిబిడ్డల్ని
ముదుసలి వాండ్రకిచ్చి
మురిసేటి భ్రష్టులార..!
బాల్యవివాహాలు చేసేకన్న
బలి ఇచ్చుట మేలుగదరా....
...అన్న పోలన్న సుభాషితం..!
...విన్న మీకు శుభోదయం....!!
అందాలు చిందే
ఆమె అధరాలు మధురం...
కాళ్లకు బందాలు వేసే
ఆ కన్నెవలపే మధురం...
ప్రాణాలను సైతం త్యాగం
చేసే ఆ ప్రేమెంతో మధురం...
...అన్న పోలన్న సుభాషితం..!
...విన్న మీకు శుభోదయం...!!



