Facebook Twitter
సుఖజీవన సూత్రాలు

ఓర్పు - నేర్పు...

మనిషికి
కావలసింది.......నేర్పు
ఉండవలసింది...ఓర్పు
కోరవలసింది......మార్పు
చెప్పవలసింది....తీర్పు

క్షమించండి...

సలహాలుంటే.......ఇవ్వండి
లోపాలు ఉంటే.....చెప్పండి
సందేహాలుంటే.....అడగండి
తప్పులుంటే.......‌.క్షమించండి

బ్రతుక్కి అర్థం తెలిసేదెలా..?

చిలికితేనే.....వెన్న దొరికేది
గతికితేనే......రుచి తెలిసేది
మునిగితేనే...ముత్యం దొరికేది
బ్రతికితేనే.....బ్రతుక్కు అర్థం తెలిసేది

దోపిడి...దొంగలు

సంఘసేవకులు సమతావాదులు
దండిగా ఉన్న ఈ భరతభూమిలో
భక్తి పేరుతో అమాయకపు జనాన్ని
దోచుకునే దొంగ బాబాలను కట్టడి చేసేదెవరు..?

కటకటాల్లోకి నెట్టేదెవరు..?

శునకం...

సాటి మనిషిని మనిషిలా చూడక 
ముష్టివానిలా చూసేవాడు...మూర్ఖుడే
వాడు కుక్కకన్న...కుష్టిరోగికన్న...హీనుడే
నరుడే నారాయణుడని నమ్మినవాడు
ధన్యుడే...వాడు దైవాంశ సంభూతుడే...