Facebook Twitter
కవిత్వమా ? వచనమా?

కవికి
కవిత్వం అమ్మ ఐతే
వచనం నాన్న
అవే కవికి రెండుకళ్ళు
కవిత్వమంటే...
కవిపండితులకే
వచనం అంటే పండితులకు 
పామరులకు సైతం
కవిత్వమంటే...
సమాస భూయిష్టమైన
అలంకార ప్రాయమైన
చిత్రవిచిత్రమైన వర్ణనలతో
పసందైన పదసంపదతో
మధురమైన మాటలతో
రమణీయంగా రసరమ్యంగా
అద్భుతంగా అలరించే విధంగా
ఒంపు సొంపులతో ఓరచూపులతో
కులుకునడకల కలికిలా కలహంసలా
కనువిందుగా పసందుగా
పరవశించే విధంగా 
బంగారు భావనలతో
సుందరమైన శిల్పంతో
పటిష్టమైన భాషా సౌందర్యంతో
కలవరింపజేసే అద్భుత‌కల్పనలతో
అలరారుతూ అంతులేని
ఆనందసాగరాన ముంచివేసేదే
మురిపించేది మైమరపించేదే...కవిత్వం

వచనం అంటే...
పండితులకు పామరులకు
అలతి అలతి పదాలతో
సులభమైన శైలిలో
సుందరమైన సందేశాలతో
హృదయాలుపరవశించేలా
కళ్ళకు కాంతినిచ్చేలా
మనుషులను కదిలించేలా
విన్నా చదివినా మనసుకెంతో
ఊరట కలిగించేలా ఉత్సాహపరిచేలా చైతన్యవంతుల్నిచేసేలా 
కఠినాత్ములకు సైతం
కనువిప్పు కలిగించేలా ఉండేదే వచనం అదే
పామరులకు ప్రవచనం పంచభక్ష్య పరమాన్నం...