కమ్యూనిటీలో
ఇమ్యూనిటీ కొరవడితే
కొరడా ఝలిపిస్తూ
వచ్చేది మహమ్మారి కరోనా
కాదు సునామీనే...అది
కట్టలుతెగిన ప్రవాహమే...
తీరం దాటితే తుఫానే...
తోక త్రొక్కిన త్రాచే...
కళ్ళెం లేని గుర్రమే...
కళ్ళముందే ప్రజలు
పిట్టల్లాగ రాలిపోతారు...
లక్షలమందిని కరోనా
పొట్టన పెట్టుకుంటుంది...
రెండవ దశంటే...
దారుణ మారణకాండకు
శ్రీకారమే...
విషంగ్రక్కే కరోనా
విలయతాండవమే...
ప్రపంచమంతా
ప్రళయమే విషవలయమే...
అతి ప్రమాదకరమైన
రెండవ దశంటే ఇదే...
కరోనా మరణమృదంగం
వినిపించే విషాదకరదశంటే ఇదే...
ఔను మనమిప్పుడు....
బ్రద్దలయ్యే అగ్నిపర్వతం
అంచున వున్నట్లే...
మనకు అనంత
ప్రళయం దాపురించినట్లే...
ఔను మనమిప్పుడు....
హోరుగాలిలో జోరువానలో
నడిసంద్రంలో వున్నట్లే...
విధ్వంసాన్ని సృష్టించే సునామీ
మనమీద విరుచుకు పడనున్నట్లే...
ఔను మనమిప్పుడు....
బుసలు కొట్టే విషసర్పం
పడగనీడలో నిదురిస్తున్నట్లే...
మన ముందు మృత్యువు
కరాళ నృత్యం చేస్తున్నట్లే...
ఇట్టి క్లిష్టపరిస్థితుల్లో తమ
ప్రాణాలను ఫణంగా పెట్టి
నిద్రపోక నిస్వార్థంగా సేవలుచేసే
ప్రాణదాతల చేతులు కట్టేసినట్లే...
నియంత్రణ లేనివారికి...
నిర్లక్ష్యం వహించేవారికి...
నిండూనూరేళ్ళు నిండినట్లే...
కాలసర్పమై చాటుమాటుగా కాటువేసే...
కాటికీడ్చే...ఈ కరోనా రక్కసి...కట్టడికి...
రామబాణం....రక్షణకవచం....వ్యాక్సినే...
ఇక ఆలోచించవద్దు...ఆలస్యం చెయవద్దు...
నిర్లక్ష్యంవద్దు.....స్వీయనియంత్రణేముద్దు...
వెంటనే వ్యాక్సిన్ వేసుకుందాం...కరోనాను ఖతం చేద్దాం...



