Facebook Twitter
ముందుజాగ్రత్తలే మనకు మందులు 

మిత్రులారా !

కరోనా అంటేనే 

ఒక కన్నీటిగాథ

కరోనా పేరు వింటేనే

మరువలేని ఒక మానసిక క్షోభ

ఈ కరోనా పిశాచితో

కాపురం తప్పదన్నప్పుడు

సహనంతో సర్దుకుపోవడమే

ఉత్తమమైన మార్గం

ఔను ఇంకెంతకాలం 

ఈ భయం గుప్పిట్లో 

క్షణక్షణం ఛస్తూ బ్రతకాలి

 

మిత్రులారా !

కరోనాను నిత్యం గుర్తుచేసుకొని  

కలవరం పడకండి కన్నీరుకార్చకండి

అధైర్యపడకండి

ఆందోళన చెందకండి ధైర్యంగా వుండండి

 

అవిగో మనకళ్ళముందే

కారుమబ్బులు కదిలిపోతున్నాయి 

అవిగో మన కళ్ళముందే 

కారుచీకట్లు తొలిగిపోతున్నాయి

గతంలో ఇంతకన్న కౄరమైన

ఘోరమైన వైరస్ లెన్నో వచ్చాయి 

మందురాగానే మాయమైపోయాయి

 

ఈ కాలక్కసి కరోనా సైతం

కన్ను మూయక తప్పదు

కార చీకటిలో, కాలగర్భంలో

కలిసిపోక తప్పదు ఇదినిజం పచ్చినిజం

 

ఇది ఏ బ్రహ్మంగారి కాలజ్ఞానమో

ఏ వేమన్న చెప్పిన వేదమో కాదు 

ఇది ప్రకృతి ధర్మం సృష్టి మర్మం

 

త్వరలోనే తొలిగి ఈ అయోమయం అంధకారం 

ఔతాయి మనందరి బ్రతుకులు బంగారుమయం

అంతవరకు ముందుజాగ్రత్తలే మనకు మందులు 

ఆపై ఇక చిరునవ్వుల చిందులే వినోదాల విందులే