Facebook Twitter
చిరకాల స్నేహం...

ఓ మిత్రమా ! 

నిన్న నీవన్నావు

స్నేహాన్ని పువ్వుతో పోల్చకు

అది వాడిపోతుందని

కాని నేడు నేనంటున్నాను

స్నేహాన్ని పువ్వుతో పోలిస్తే 

అది పరిమళిస్తుందని

 

ఓ మిత్రమా ! 

నిన్న నీవన్నావు

స్నేహాన్ని మంచుతో పోల్చకు

అది కరిగిపోతుందని

కాని నేడు నేనంటున్నాను

స్నేహాన్ని మంచుతో పోలిస్తే 

అది చల్లదనాన్నిస్తుందని

 

ఓ మిత్రమా ! 

నిన్న నీవన్నావు

స్నేహాన్ని ఆకుతో పోల్చకు 

అది రాలిపోతుందని

కాని నేడు నేనంటున్నాను

స్నేహాన్ని ఆకుతో పోలిస్తే 

అది పచ్చదనాన్నిస్తుందని

 

ఓ మిత్రమా ! నిజం తెలుసుకో

స్నేహాన్ని టానిక్ తో పోలిస్తే

అది అంతులేని శక్తి నిస్తుందని

స్నేహాన్ని అమృతంతో పోలిస్తే

అది మృత్యుభయము లేకుండ

మనల్ని ముందుకు నడిపిస్తుందని, 

దేనితో పోల్చుకోవాలో ఇక నీవే తేల్చుకో

 

కానీ ఓ మిత్రమా !

ఉండాలి మన ఈస్నేహం చిరకాలం  

వెలుగుతూ వుండాలి మన స్నేహజ్యోతి

సూర్యచంద్రులు ఉన్నంత కాలం, ఆ

నింగిలోతారలు వెలుగుతున్నంతకాలం