Facebook Twitter
ఇది పచ్చి నిజం ఎవరూ కాదనలేని నగ్నసత్యం

ఎండాకాలంలో చెప్పులు కొనాలి
వర్షాకాలంలో గొడుగు కొనాలి
చలికాలంలో దుప్పటి కొనాలి
కోట్లు ఆర్జించాలంటే మాత్రం
రేట్లు పెరగకముందే ప్లాట్లు కొనాలి
అన్న పోలన్న సుభాషితం విన్న మీకు శుభోదయం

చిన్నవయసులోనే పొదుపు చేయాలి
ఉద్యోగంలో చేరగానే పదవీవిరమణకు
ఫండ్ ను ఏర్పాటు చేసుకోవాలి
పెళ్లి కాగానే హనీమూన్ కి వెళ్ళాలి
పిల్లలు పుట్టగానే వారి బంగారు
భవిష్యత్తుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి
అన్న పోలన్న సుభాషితం విన్న మీకు శుభోదయం

చీకటి పడకముందే దీపం వెలిగించుకోవాలి
దీపం ఆరకముందే ఇల్లు చక్కదిద్దు కోవాలి
వయసు ముదరక ముందే ఇన్సూరెన్స్ చేసుకోవాలి
అన్న పోలన్న సుభాషితం విన్న మీకు శుభోదయం

ఆరోగ్యంగా వుండాలంటే వ్యాయామం చెయ్యాలి
అవసరాలు తీరాలంటే అప్పులు చేయాలి
ఆస్తులు ఆర్జించాలంటే వ్యాపారం చెయ్యాలి
అన్న పోలన్న సుభాషితం విన్న మీకు శుభోదయం

మూడో వ్యక్తితో ముచ్చట లాడరాదు
మనసులో అనుమానం వుంచుకోరాదు
కడుపులో కక్షను పెంచుకోరాదు,కోపంతో
రెచ్చిపోయి పిచ్చిపిచ్చిగా మాట్లాడరాదు
పచ్చని కాపురంలో చిచ్చు పెట్టుకోరాదు
అన్న పోలన్న సుభాషితం విన్న మీకు శుభోదయం

ఎన్నిసార్లు పోటీలో పాల్గొన్నామన్నదికాదు ముఖ్యం
కప్పు గెలిచామా లేదా అన్నదే ముఖ్యం
ఎన్ని సార్లు పరీక్షలు వ్రాశామన్నది కాదు ముఖ్యం
ఫస్ట్ ర్యాంక్ కొట్టామా లేదా అన్నదే ముఖ్యం
ఎన్ని ఇంటర్వ్యూ లకు అటెండ్ అయ్యామన్నదికాదు
ముఖ్యం ఉద్యోగంలో చేరామా లేదా అన్నదే ముఖ్యం
అన్న పోలన్న సుభాషితం విన్న మీకు శుభోదయం

సుఖపడాలంటే సుర్యునికంటే ముందులెయ్యాలి
షష్టి పూర్తి చేసుకోవాలనుకుంటే
పుష్టికరమైన ఆహారం పుచ్చుకోవాలి
కష్టపడి ఆర్జించిన తర్వాత కన్నుమూసేదాక
నిత్యం ఆ భగవంతుని స్మరించాలి
నిస్వార్థంగా నిరుపేదలకు సేవ చేయాలి
అన్న పోలన్న సుభాషితం విన్న మీకు శుభోదయం