Facebook Twitter
శతృవులు లేని శేషజీవితం…

మిత్రమా!
వెన్ను తట్టక పోయినా ఫరవాలేదు కానీ,
ఎవరినీ వెన్ను పోటు పొడవకు,వెక్కిరించకు

మిత్రమా!
ప్రేమను పంచకపోయినా పరవాలేదు కానీ,
ఎవరినీ ద్వేషించకు, ఎవరిమీద పగను పెంచుకోకు,

మిత్రమా!
మంచిని చేయకపోయినా ఫరవాలేదు, కానీ,
ఎవరినీ నిలువునా ముంచుకు, వంచించకు

మిత్రమా!
కడుపుకింత తిండి పెట్టకపోయినా పరవాలేదు కానీ,
ఎవరినీ తిట్టకు అకారణంగా ఎవరి కడుపు కొట్టకు.

మిత్రమా!
ఇదే ఇదే ప్రశాంతమైన జీవితానికి ప్రథమసూత్రం
శతృవులెవరూ లేకుండా గడపాలి నీ శేషజీవితం