మూడుముళ్ళు పడగానే
ఏడడుగులు నడవగానే
ఇద్దరిని గదిలో బంధిస్తారు
శోభనం పేరుతో...........
ఒక్కటవ్వాలన్నకోరికతో...
ఇద్దరు ముగ్గురవ్వాలన్నఆశతో...
కోటిఆశలతో కాపురానికెళ్లే
కొత్తజంటలకిదే నా "సంసారసందేశం"
రుచికరమైన వంటకాలతో
అందరి "కడుపులు" నింపాలి
మమతానురాగాలతో
"మనసులు" గెలవాలి
అత్తా మామల" మెప్పును" పొందాలి
ప్రతిపగలు "పండువెన్నెలగా"
"ప్రతిరాత్రి నవరాత్రిగా"
పడకగదిని...పరవశింపచేయాలి
మగనిమదిలో ప్రేమపరిమళాలు
వెదజల్లాలి ముద్దు మురిపాలతో
మురిపించాలి...మైమరిపించాలి
"కొత్తమొగున్ని కొంగున" ముడేసుకోవాలి
సఖ్యత సభ్యతా సహనం సమయస్ఫూర్తి
సర్దుబాటుగుణం అనురాగం ఆప్యాయతలే
"అదృశ్య ఆభరణాలుగా" అలంకరించుకోవాలి
ఐతే రాక్షసత్వం ఇంట...రాజ్యమేలే వేళ
అత్తమామలు ఇంట...పెత్తనం చెలాయించే వేళ
నిప్పులా మండాలి...నిర్భయంగా ఉండాలి
కనకదుర్గలా కనిపించాలి...కత్తిని ఝలిపించాలి
ఒకటి మాత్రం ఎవరూ కాదనలేని పచ్చినిజం
చిరకాలముండవు ఈ...చింతలుచీకాకులు
పచ్చని కాపురాన చిచ్చురేపు లోకులుపలుగాకులు
పంతాలు పట్టింపులు...పగప్రతీకారాలొద్దే వద్దు
ప్రేమించుకొని...పెనవేసుకుంటేనే హద్దు ముద్దు
ఒకరినొకరు ద్వేషించుకొంటూ సాధించుకుంటూ
వేదనలకు వెతలకు గురికారాదు...వేరైపోరాదు
చిరుబురులాడుతు ఎందుకు...చీకట్లోచిందులు
ముఖాముఖిచర్చలే...మనస్పర్థలకు మందులు



