Facebook Twitter
కలియుగ కర్ణుడు సోనుసూద్

మందీమార్బలం లేకున్న
తనవెంట ఎవరూ రాకున్నా
ఒంటరిగా సాగే యుద్ధనౌక

కోట్లకు పడగలెత్తిన కార్పోరేట్లు
విలాసవంతమైన జీవితాన్ని గడిపే
విశ్వాసంలేని సెలబ్రిటీలు
మూడుతరాలకు తరగనిఆస్తిని
ఆర్జించిన రాజకీయనేతలు
తామెందుకు దాతృత్వంలో
మరుగుజ్జులమయ్యామో
తానెలా ఎవరెస్టు శిఖరంలాఎదిగాడో
తమను తాము ప్రశ్నించుకోవాలి

ఏ పదవులు ఏ అధికారం లేకున్నా
ఏ సన్మానాలు ఏ సత్కారాలు
ఆశించక నిస్వార్థంగా,నిర్విరామంగా
"అన్నా" అనగానే నేనున్నా,వస్తున్నానంటూ
అందరికీ తృప్తిగా మనస్పూర్తిగా సేవచేసేవాడు

గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కు
ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ విభుషణ్
భారతరత్న పురస్కారాలకు అర్హుడైనవాడు
మహాత్ములకే మహాత్ముడు సేవారత్న
అందరినీ కదిలించిన కనువిప్పుశకలిగించిన
ఎందరిలోనో గొప్ప స్పూర్తిని రగిలించిన
రియల్ సూపర్ హీరో ఎవరు ఎవరు? ఇంకెవరు

కరుణామయుడు కలియుగదైవం సోనుసూద్

ధనవంతులందరూ దాతలు కాదు
కాని,దయగల దాతలందరూ దైవాలే
ధన్యజీవులే పుణ్యమూర్తులే చిరంజీవులే

ముక్కోటి దేవుళ్ళకు మ్రోక్కిఅందరు కోరేదొక్కటే
130 కోట్లమంది భారతీయుల ఊపిరి పోసుకుని
ఈ కలియుగ కర్ణుడు మన సోమసూద్....
హాయిగా చల్లగా నిండునూరేళ్ళు వర్ధిల్లాలని.