కౄరమైన కరోనా వైరస్ తోప్రపంచంలో
లక్షలాదిమందికి మరణశిక్షలు విధించిన చైనా
యుద్దానికి సిద్ధమై చర్చలకు ఆహ్వానం పలికి
కుట్రలు, కుతంత్రాలెన్నో పన్ని ,హద్దుమీరి
సరిహద్దుల్లో ద్వందనీతితో దొంగదెబ్బ తీసింది
చల్లని గాల్వాయ్ లోయ మంచుకొండల్లో
శతృవులతో ప్రాణాలకు తెగించి పోరాడిన
మన వీరజవాన్ల ఎర్రని రక్తం ఏరులైపారింది
నేడు మంచుకొండల్లో నేలకొరిగిన
మన వీరజవాన్ల మరణవార్తతో
సలసలకాగే మన భారతజాతి
గుండెలు చల్లబడాలంటే,
పోరాడి రక్తాన్ని చిందించి,అమరులై
భారతమాత పాదాలచెంత పువ్వులై రాలిన
20మంది భారతమాత ముద్దుబిడ్డల
ఆత్మలు శాంతించాలంటే,
గుండెలు పగిలేలా రోదించాలనివున్నా
భర్తల పార్థివదేహాలున్న
శవపేటికల ముందు నిశ్చేష్టులై నిలుచుని
జై భారతమాతాకు జై అంటూ నినదిస్తున్న
ఆవీరవనితల నుదుట రక్తంతిలకం దిద్దాలంటే,
మృత్యువులా ముందుకు దూసుకు వస్తున్న
ఆ ముస్కరులపై ఎదురుదాడి చేయక తప్పదు
కౄరులైన ఆశతృమూకల,గుండెల్లో తూటాలు
పేల్చక తప్పదు,గుణపాఠం నేర్పక తప్పదు
శాంతి పావురాల రెక్కలు విరిచిన చైనా
పడుకున్న కోడెనాగు తోక తొక్కిన చైనా
వేదభూమియైన భారత్ పై దాడి చేసిన చైనా
భారీగా మూల్యం చెల్లించుకోక తప్పదు తప్పదు
అమరులైన వీరజవాన్లకు సెల్యూట్ చేస్తూ...
వారి ఆత్మలు శాంతించాలని ఆశిస్తూ...
అశ్రునయనాలతో చేస్తున్న అక్షరనీరాజనం...



