ఏ గుడి బడిగంట !
మ్రోగదు...తనకై తాను
...మనం మ్రోగించనిదే
ఏ దీపం !
వెలగదు...తనకై తాను
...మనం వెలిగించనిదే
ఏ ఫ్యాను !
తిరగదు... తనకై తాను
...మనం స్విచ్ వేయనిదే
ఏ చెట్టు !
ఎదగదు... తనకై తాను
...మనం విత్తనం నాటనిదే
ఏ బిడ్డా !
జన్మించదు...తనకై తాను
...అమ్మ నాన్నలు జత కూడనిదే
ఏ ఉద్యోగి !
ఎదగలేడు...ఉన్నతంగా తనకై తాను
...మరో ఆత్మీయుని ఆదరణలేనిదే
ఏ పంట !
పచ్చగా పెరగదు... తనకై తాను
...మనం దుక్కిదున్ని సాగుచేయనిదే
ఏ పసిబాలుడూ !
నడవలేడు...ఎంతో దూరం
...అమ్మ ఎత్తుకోనిదే ఎదకు హత్తుకోనిదే
ఏ విద్యార్థి !
ఆర్జించలేడు...విజ్ఞానాన్ని తనకై తాను
...ఏగురువు దగ్గరైనా శిష్యరికం చేయనిదే
ఆ గురువు !
ఇంట్లో అమ్మ కావచ్చు మననాన్న కావచ్చు
ప్రాణమిత్రులు కావచ్చు..ప్రపంచం కావచ్చు
ఎవరూ పోటీలో గెలవలేరు ఒకరు ఓడనిదే
ఎవరూ రాణించలేరు ఒకరు పతనం కానిదే
ఎవరూ జన్మించలేరు మరొకరు మరణించనిదే
ఔను మనం పాత్రధారులం ఆ సృష్టికర్తే సూత్రధారి



