మన దేశరక్షణకోసం
130 కోట్లమంది భారతీయ
కుటుంబాల భద్రత కోసం
ఎత్తైన మంచుకొండల్లో
ఎముకలుకొరికే చలిలో
చిమ్మచీకట్లలో డెగకళ్ళతో నిఘాపెట్టి
భారత భూభాగంలోకి దొంగచాటుగా
చొరబడే శత్రువుల్ని మట్టుపెట్టడానికి
చేతుల్లో మరతుపాకులు ధరించి,
నిద్దురలేక నిరంతరం సరిహద్దుల్లోపహారాకాసే
ఓ వీరసైనికులారా!
ఓ భరతమాత ముద్దుబిడ్డలారా !
మంచుకొండల్లో మండే ఓ సూర్యులారా!
వందనం !అభివందనం !మీకు పాదాభివందనం!!
మీరు నిద్రలేచి జపించే మంత్రం వందేమాతరం
మీరు కలలో సైతం కలవరించేది త్రివర్ణపతాకం
మీరు యుద్దవీరులు,శూరులు, విక్రమార్కులు
మీరు శత్రువులగుండెల్ని చీల్చే మరఫిరంగులు
మీ గుండెల చప్పుడు లబ్ డబ్ అనికాదు
జైహింద్, జై భారత్ మాతా, జై జవాన్ అనే
మీరు ఎప్పుడూ సిద్దం శతృమూకలతో పోరాడేందుకు రక్తాన్నిచిందించేందుకు,మృత్యువును ముద్దాడేందుకు
అందుకే ఓ వీరసైనికులారా!
ఓ భరతమాత ముద్దుబిడ్డలారా !
మంచుకొండల్లో మండే ఓ సూర్యులారా!
వందనం !అభివందనం !మీకు పాదాభివందనం!!



