ఏ పాట వింటే
భారతీయులందరి
ఒళ్ళు పులకరిస్తుందో
ఏ పాట వింటే
తెల్లదొరలగుండెల్లో
మరఫిరంగులు పేల్తాయో
ఏ పాట వింటే
ప్రజలు ఒక ప్రభంజనమై
ఒక ఉప్పెనై విరుచుకుపడతారో
ఏ పాట వింటే
పశువులు శిశువులు
సైతం ఉలిక్కిపడి లేస్తాయో
ఏ పాట వింటే
అణువణువునా
తరతరాలుగా నరనరాలలో
స్వాతంత్ర్య కాంక్ష
దేశభక్తి రగులుతుందో
ఏ పాట వింటే
మన స్వాతంత్ర్య
సమరయోధులంతా
పిడికిళ్లు బిగించి సింహాలై
సమరానికి సిద్దమౌతారో
ఏ మంత్రదండంతోనైతే
మన విప్లవవీరులు
భగత్ సింగ్, ఝాన్సీలక్ష్మీబాయి
అల్లూరి సీతారామరాజు
పరమకౄరులైన,
ఆ తెల్లదొరలను ఎదిరించి
వారి గుండెల్లో నిదురించారో
అదేఅదే మన జాతి పదేపదే
పాడుకునే "వందేమాతరం"
వందేమాతరమంటే
ఒక పాట కాదు ఒక తూటా
వందేమాతరమంటే
ఒక గేయం కాదు ఒక ఆయుధం
వందేమాతరమంటే
ఒక శంఖారావం ఒక సింహనినాదం
వందేమాతరమంటే
జాతిపిత మనకిచ్చిన జైలు పిలుపు
వందేమాతరమంటే
చారిత్రాత్మక మైన ఒక గొప్ప మలుపు
వందేమాతరమంటే మన భరతమాత గెలుపు



