పురుషుడిగా పుట్టి లాభమేమి?
పురుషుడిగా
పుణ్య భూమిలో
పుట్టి లాభమేమి
పురుగుల
జీవించరాదు
చెదపురుగులా
చీడపురుగులా
పేడ పురుగులా
జీవించరాదు
పుణ్య కార్యాలను
తలపెట్టాలి
పురోభివృద్ధికి
పునాది కావాలి
పువ్వుల పడవ
కావాలి నీ జీవితం
పూరిగుడిసెలో
పుట్టిననేమి నీవు
పులిలా గర్జించాలి
పులిలా బ్రతకాలి
సింహంలా
స్వేచ్ఛగా విహరించాలి
ఏనుగులా ఎదురు తిరగాలి
రేకెట్ లా నింగిలోకి ఎగరాలి
రామబాణంలా దూసుకుపోవాలి



