Facebook Twitter
నే వదిలి పెట్టబొమ్మాళీ…

వినాలనుకున్న
పాట వినండి

తినాలనుకున్న
తిండి తినండి

కొనాలనుకున్న
ప్లాటు కొనండి

దేనికి ఆలస్యం ?
ఎందుకు ఊగిసలాట ?

ఊగిసలాడినా
ఉయ్యాల జంపాలూగినా

రేపటికి ఈ రేట్లు వుండవు
మీకు నచ్చిన ఆ ప్లాట్లు వుండవు

ఔను ఆలస్యం చేయడమంటే
అతిగా ఆలోచించడమంటే

ఊగిసలాడడమంటే ఓ బంగారు
అవకాశాన్ని చేజార్చుకోవడమంటే

అర్దరాత్రి అదృష్టదేవత వచ్చి
మీ తలుపును తట్టడం

తలుపును తియ్యకపోగా
మీరు నిద్రలో బూతులు తిట్టడం

గురకలు పెట్టి నిద్రపోవడం
ఉదయాన్నే లేచి తలుపును తియ్యడం

తియ్యగానే అదృష్టదేవత
హఠాత్తుగా మాయమైపోవడం

దురదృష్టదేవత మీ ఇంట్లో దూరి
దుప్పటి కప్పుకొని పడుకోవడం

ఇక ఈ ఇల్లు నే వదిలి పెట్టబొమ్మాళీ
అంటూ ఇంట్లోనే శాశ్వతంగా తిష్టవేయడం