Facebook Twitter
అది తత్వం.ఇది తంత్రం

మాట మీద నిలబడటం వేరు
నిలబడే మాట పలకడం వేరు
మొదటిది నిజాయితీ - రెండవది దార్శనికత

చెప్పింది చేయడం వేరు
చేసేది చెప్పడం వేరు
మొదటిది నిబద్దత -
రెండవది పారదర్శకత

ఇతరుల మీద గెలవడం వేరు
ఇతరుల మదిలో నిలవడం వేరు
మొదటిది తంత్రం - రెండవది తత్వం

ఎంత దూరమైనా వెళ్ళడం వేరు
ఎంత దూరం వెళ్ళాలో తెలియడం వేరు
మొదటిది సాహసం - రెండవది వివేకం

ఎలాగైనా చేయడం వేరు
ఎలా చేయాలో తెలిసుండటం వేరు
మొదటిది ఓర్పు - రెండవది నేర్పు

ఇతరులపై చూపుడు వేలు ఎత్తడం వేరు
ఇతరుల కోసం పిడికిలి బిగించడం వేరు
మొదటిది... నింద నీడన అస్తిత్వం
రెండవది... నీడ వీడిన విప్లవం

గెలవడం వేరు - గెలిపించడం వేరు
మొదటిది నేను - రెండవది మేము

సంఘం కట్టడం వేరు -
సంఘటితం అవ్వడం వేరు
మొదటిది వ్యూహం -
రెండవది చైతన్యం

మొదటిది కావాలో...
రెండవది కావాలో తేల్చుకోండి
ఆలోచన మనదే ...ఆచరణా మనదే ...అధికారం మనదే