Facebook Twitter
అవును ఇది నిజం 

ఏ గుడి బడిగంట
తనకై తాను మ్రోగలేదు
మనం మ్రోగించనిదే
ఏ దీపం తనకై
తాను వెలగలేదు
మనం వెలిగించనిదే

ఏ ఫ్యాను తనకై
తాను తిరగలేదు
మనం స్విచ్ వేయనిదే
ఏ చెట్టు తనకై
తాను ఎదగలేదు
మనం విత్తనం నాటనిదే

ఏ బిడ్డా తనకై తాను
జన్మించలేదు
అమ్మనాన్నలూ
జతకూడనిదే
ఎవరూ ఎదగలేరు
ఆత్మీయుల
ఆదరణలేనిదే 
ఏ పసిబాలుడూ
నడవలేడు అమ్మ
ఎత్తుకోనిదే
ఎవరూ గెలవలేరు
ప్రత్యర్థి ఓడిపోనిదే

ఏ పంట తనకైతాను
పచ్చగా పెరగలేదు
మనం దుక్కిదున్ని
సాగుచేయనిదే
ఏ విద్యార్థి తనకై తాను
విజ్ఞానాన్ని ఆర్జించలేడు
ఏ గురువు దగ్గరైనా
శిష్యరికం చేయనిదే
ఆ గురువు ఇంట్లో
అమ్మానాన్నలు కావచ్చు
తోటిమిత్రులు కావచ్చు
పరులు కావచ్చు
ప్రపంచం కావచ్చు

ఎవరూ రాణించలేరు
మరొకరు పతనం కానిదే
ఎవరూ జన్మించలేరు
మరొకరు మరణించనిదే
ఇక్కడ సందేశం ఒక్కటే
ఒకరి కోసం మరొకరు...
ఒకరు ముందు మరొకరు వెనక...