నీ మంచితనాన్ని
నీ అమాయకత్వాన్ని
ఆసరా చేసుకొని ఒకడు
నీ యింటికే నిప్పు పెడుతూవుంటే
అది తప్పుఅని చెప్పకపోతే
వద్దు అని వారించకపోతే ఎలా?
నీ ఇల్లు కాలి బూడిదైతే
నీకా నష్టం వాడికా ?
మన కన్నబిడ్డలు తప్పుచేస్తే
మంచిమాటలు చెప్పకపోతే
మందలించక పోతే ఎలా?
శపించవద్దు కాని గద్దించాలిగా
మన క్రింది ఉద్యోగులు తప్పుచేస్తే
కఠినంగా వుండాలి కళ్ళెర్ర చెయ్యాలి
కస్సుబుస్సు మనాలి కాని
కడుపు మీద కొట్టకూడదుగా
విద్యార్ధి ఒకరు విఫలమై ప్రేమలో
విరక్తి చెంది బ్రతుకులో
నీ కళ్ళ ముందే నదిలోదూకి
ఆత్మ హత్య చేసుకుంటే
ఈత వచ్చిన నీవు రక్షించకపోతే ఎలాగ?
కత్తులు కటారులు పట్టుకొని
త్రాగుబోతు ఒకడు
వీధిలో వీరంగం చేస్తుంటే
ఖాకీ డ్రస్సులో వున్న నీవు
కంట్రోల్ చెయ్యకపోతే ఎలాగ?
సహనం మంచిదే కాని
సమయానికి స్పందించక పోతే
ఆయుధముండి చేతిలో
ఆపదలోవున్నవారని ఆదుకోకపోతే ఎలా
సమయముండి స్పందిస్తే
సకాలంలో సహాయం అందిస్తే
అదే కదా సంస్కారం
అట్టి వారికందరు చేస్తారు
సాస్టాంగ నమస్కారం



