Facebook Twitter
జై బోలో జై బోలో! గిడుగు తాతకు జైబోలో!!

జై బోలో జై బోలో! గిడుగు తాతకు జైబోలో!
జై బోలో జై బోలో !తెలుగు భాషకు జైబోలో!
జై బోలో జై బోలో !తెలుగు తల్లికి జైబోలో!

గ్రాంధిక భాషను గంగలో కలిపి తేనెకన్న తీయనైన

అచ్చతెనుగు భాషను తెచ్చే మన గిడుగు తాత
గిడుగు తాతంటే గ్రాంధిక భాష మీద పడ్డ పిడుగు
గిడుగు తాత అంటే తెలుగు భాష తలపై గొడుగు
అందుకే  ||జై బోలో జై బోలో||

మన తెలుగు భాషకు అక్షరాలు యాబైయారన్నాడు
అవే మన తెలుగు జాతికి కోటివరాలన్నాడు
వద్దు వద్దు పరబాషలు మనకొద్దన్నాడు
మన తెలుగు భాషే మనకు ముద్దన్నాడు
అందుకే   ||జై బోలో జై బోలో||

మన తెలుగు సంస్కృతి, మన తెలుగు తల్లి
నుదుట దిద్దిన కుంకుమతిలకమన్నాడు
మన తెలుగు సాంప్రదాయాలు,మనతెలుగుతల్లికి
వెలకట్టలేని స్వర్ణాభరణాలన్నాడు
అందుకే   ||జై బోలో జై బోలో||

తెలుగు పండితుల కావ్యాలు బృహత్ గ్రంథాలు
మన తెలుగు తల్లికి కట్టబెట్టిన పట్టుచీరలన్నాడు
తెలుగు కవులు వ్రాసిన పద్యాలు మన తెలుగు తల్లి
మెడలో మెరిసే పచ్చని కెంపుల హారాలన్నాడు
అందుకే    ||జై బోలో జై బోలో||

నేను తెలుగు వాడిని నా బాష తెలుగు భాష
నా జాతీయ జెండాలో తెలుగుతనమున్నది
నా అందమైన తెలుగు భాషలో అమృతమున్నది
నా కమ్మనైన తెలుగు భాషలో అమ్మతనమున్నది
నా తెలుగు భాష నా జాతి ఆత్మ ఘోషన్నాడు
నా తెలుగు యాస నా జాతి జీవనశ్వాసన్నాడు
అందుకే  ||జై బోలో జై బోలో||

ఏమని వర్ణింతు నా తెలుగుభాష వైభవాన్ని
ఏమని వర్ణింతు నా తెలుగువాడి పౌరుషాన్ని
తెలుగుతల్లి కడుపున పుట్టడమే
మన పూర్వజన్మ సుకృతమన్నాడు

ఎక్కడ తెలుగు వుంటుందో
అక్కడ వెలుగు వుందన్నాడు
ఎక్కడ వెలుగు వుంటుందో
అక్కడ విజ్ఞానం వికాసం విజయముందన్నాడు
అందుకే 
జై బోలో జై బోలో !గిడుగు తాతకు జైబోలో!
జై బోలో జై బోలో !గాంధీ తాతకు జైబోలో!
జై బోలో జై బోలో !తెలుగు భాషకు జైబోలో!
జై బోలో జై బోలో !తెలుగు తల్లికి జైబోలో !
జై బోలో జై బోలో !జాతీయ జెండాకు జైబోలో !
జై బోలో జై బోలో !భారతమాతకు జైబోలో!
జై బోలో జై బోలో !స్వాతంత్రయోధులకు జైబోలో!
జై బోలో జై బోలో !అమరవీరులకు జైబోలో!

ఓ తెలుగు భారతీ!
మీకు ప్రణామం ..ప్రణామం... ప్రణామం..
ఓ తెలుగు తల్లీ !
మీకు వందనం! అభివందనం! పాదాభివందనం!
ఓ గిడుగు తాతయ్యా! మీకిదే మా అక్షర నీరాజనం