వెజిటేబుల్స్ తో వడ

 

 

 

 

కావలసిన పదార్థాలు

పాలకూర -  1 కప్పు కట్ చేసినవి

కొత్తిమీర -  ఒక కట్ట కట్ చేసినవి

క్యాబేజీ -  100 గ్రాములు

గరం మసాల  -  2

బీన్స్ ముక్కలు -  1 కప్పు

క్యారెట్  - ఒక నాలుగు ( కట్ చేసినవి)

పచ్చిబఠాణీలు -  అర కప్పు

పచ్చిమిర్చి - 8

కరివేపాకు -  కొద్దిగా

నూనె -  సరిపడా

అల్లం వెల్లిల్లి పేస్ట్ - 2 స్పూన్లు

శెనగపిండి -  ఒక కప్పు

ఉప్పు -  తగినంత

 

తయారు చేయు విధానం:

ముందుగా  కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు ముక్కలు ,బఠాని కొంచం సాల్ట్ వేసి  ఉడించి పెట్టుకోవాలి.

తర్వాత  ఒక గిన్నె తీసుకుని అందులో శెనగపిండి, గరం మసాలా, కొత్తిమీర, పాలకూర, కరివేపాకు,  పచ్చిమిర్చి, ఉప్పు, ఉడికించిన కూరగాయలు వేసి పిండిని కొద్దిగా గట్టిగా వడలు వేయడానికి   అనువుగా వుండేలా  కలుపుకోవాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని  మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసి కాగాక  పిండిని కావలసిన సైజు లో తీసుకుని వడల్లా వేసుకుని  బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకుని ప్లేట్ లోకి తీసుకుని సాస్ తో సర్వ్ చేసుకోవాలి.