జొన్న షర్‌బత్‌

 

 

 

కావలసిన పదార్ధాలు: 

జొన్నలు - పావు కప్పు

బెల్లం పొడి - అర కప్పు

ఐస్‌ ముక్కలు - కొద్దిగా

చల్లటి నీళ్లు - 3 కప్పులు

మిరియాలు - 10

నిమ్మ రసం - 2 టేబుల్‌ స్పూన్లు

నిమ్మ కాయ ముక్కలు - 3

తాజా బత్తాయి రసం - 1 కప్పు

 

తయారుచేసే విధానం:

వేసవి కాలంలో అన్నీ చల్లచల్లగా, జ్యూసుల్లాంటివే తాగాలనిపిస్తాయి. అవే వేసవి తాపాన్ని తీర్చగలవు. ఎండలో ఇంటికొచ్చేసరికి చల్లని జ్యూసు, షర్బత్ తాగితే ఆ హాయే వేరు.. కదా.. మనం ఇప్పుడు జొన్న షర్‌బత్‌ ఎలా తయారుచేయాలో చూదాం..

ముందుగా జొన్నలను మంచి నీళ్లలో శుభ్రంగా కడిగి నీళ్లను ఒంపేయాలి. ఒక పాత్రలో తగినన్ని మంచి నీళ్లు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి. కడిగిన జొన్నలు జత చేసి బాగా కలియబెట్టి, మంట తగ్గించి పది నిమిషాలపాటు ఉడికించి దింపేయాలి. మిరియాలు, నిమ్మ కాయ ముక్కలు, బెల్లం పొడి వేసి బాగా కలపాలి. బాగా చల్లారాక వడకట్టాలి. నిమ్మ రసం, బత్తాయి రసం, ఐస్‌ ముక్కలు జత చేసి బాగా కలిపి చల్లగా అందించాలి.