ఆలూ లాలీపాప్స్

 

 

 

సాధారణంగా పిల్లలు క్యాబేజీ, క్యారెట్ లాంటివి తినడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు వాడిని డైరెక్టుగా కాకుండా స్టఫ్ గా ఉపయోగించి పెట్టవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

 

కావలసిన పదార్ధాలు:

బంగాళదుంపలు        - 2

శెనగపిండి                - 2 చెంచాలు

క్యారెట్ తురుము     - 1/2 కప్పు     

క్యాబేజి తురుము     - 1/2 కప్ప

సోయాసాస్              - 2 చెంచాలు

చిల్లీసాస్                  - 2 చెంచాలు

ఉప్పు                     - రుచికి తగినంత

నూనె                      - ఒక కప్పు

 

తయారీ విధానం:

ముందుగా బంగాళదుంపలు శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకోవాలి. బంగాళదుంపలు ఉడికిన తరువాత మెత్తగా చేసుకొని దానిలో శనకపిండి, క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, సోయాసాస్, చిల్లీసాస్, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్రెడ్ పొడిలో అటు ఇటూ తిప్పి దానిని ఒక స్టిక్ కు పెట్టుకోవాలి (లాలీ పాప్ లాగా). ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేసి అది కాగిన తరువాత ఈ లాలిపాప్స్ నూనెలో వేసి ఎర్రగా వేయించుకోవాలి అంతే వేడి వేడి లాలిపాప్స్ రెడీ అయిపోయినట్టే. వీటిని టమోట సాస్ తో తింటే చాలా రుచిగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.

టిప్: క్యాబేజీ ని ఉడికించి వేసుకోము ఎందుకంటే అలా వేసుకుంటే ఎక్కువ నీరు వస్తుంది.

 

- రమ