మసాలా ఇడ్లీ

 

 

 

కావలసినవి:-

మినప్పప్పు - కప్పు

అటుకులు - కప్పు

మెంతులు - టీ స్పూను

ఉప్పు - తగినంత

క్యారట్ తురుము - పావు కప్పు

కరివేపాకు - కొద్దిగా

పచ్చిమిర్చి పేస్ట్ - టీ స్పూను

వంటసోడా - పావు టీ స్పూను

ఆవాలు - అర టీ స్పూను

ఉప్పు - తగినంత

నూనె - టేబుల్ స్పూను

ఇడ్లీ నూక - 4

ఉల్లి తరుగు - పావు కప్పు

శనగపప్పు - పావు కప్పు

కొత్తిమీర -  కొద్దిగా

 

తయారుచేయు విధానం:-

ముందుగా మినప్పప్పు,శనగ పప్పు,అటుకులు విడివిడిగా నానపెట్టుకుని తరువాతి రోజు విడివిడిగా  గ్రైండ్ చేసుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేసి కాగాక ఆవాలు , ఉల్లితరుగు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి వేయించి, స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక ఇడ్లీ పిండిలో వేసి కలుపుకోవాలి నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు,క్యారట్ తురుము, కొత్తిమీర తరుగు, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలిపి  ఇడ్లీలు ఉడికాక చట్నీ తో సర్వ్ చేసుకోవాలి.