వంకాయ మసాల రెసిపి

 

 

 

కావలిసిన పదార్ధాలు :

వంకాయలు - పావు కేజీ

వేరుశెనగపప్పు - 50 గ్రాములు

జీర - ఒక స్పూన్

ఉప్పు- ఒక స్పూన్

పసుపు - అర స్పూన్

ఆవాలు - 1 స్పూన్

ఉల్లిపాయలు

2 చింతపండు - 10 గ్రాములు

వెల్లుల్లి - 6

ఎండు కొబ్బరి - 2

ఎండు మిరపకాయలు - 4

 

తయారీ విధానం :

ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని వేరుశెనగపప్పు ని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు పాన్ తీసుకుని కొంచం ఆయిల్ వేసి జీర, ఎండు మిరపకాయలు వేయించాలి.

కొబ్బరి,పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని పేస్టు చేసుకోవాలి.

వేరే పాన్ పెట్టి నూనె వేసుకుని కాగాక కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలని వేసి వేయించాలి. తర్వాత వంకాయ ముక్కలని వేసుకోవాలి.

ఒక రెండు నిముషాల గ్రైండ్ చేసుకున్న పేస్టు వేసి వేగనివ్వాలి తర్వాత ఉప్పు ,చిటికెడు పసుపు వేసుకోవాలి.

చింతపండు రసం చిక్కగా తీసి కర్రీ లో కలుపుకుని ఒక 10 నిముషాలు ఉడకనివ్వాలి.