బీన్స్ ఫ్రై

కావాల్సిన పదార్థాలు:

చిన్నగా తరిగిన బీన్స్ - పావు కిలో

పసుపు - పావు టీ స్పూన్

ఉప్పు - రుచికి సరిపడా

నీళ్లు -పావు కప్పు

నానబెట్టిన శనగపప్పు - 2 టేబుల్ స్పూన్స్

ఎండు మిర్చి - 6

జీలకర్ర - 1 టీస్పూన్

నూనె - 1 టేబుల్ స్పూన్

తాళింపు దినుసులు - 1 టేబుల్ స్పూన్

కరివేపాకు - 1 రెమ్మ

పచ్చికొబ్బరి తురుము - పావు కప్పు

తరిగిన - కొత్తమీర కొద్దిగా

తయారీ విధానం:

ముందుగా జార్ లో శనగపప్పు, ఎండుమిర్చి, జీలకర్ వేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి.

కడాయిని స్టవ్ మీద పెట్టి బీన్స్, పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి.

తర్వాత నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు మూతపెట్టి ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించాలి.

తర్వాత మూత తీసి నీరంత పోయేవరకు వేయించుకుని పక్కన పెట్టుకోవాలి.

తర్వాత కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేసుకోవాలి.

తర్వాత తాళింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేయి వేయించాలి.

తర్వాత మిక్సీ పట్టుకుని శనగపప్పు మిశ్రమం వేయాలి. తర్వాత ఉడికించి బీన్స్ వేసి వేయించుకోవాలి.

వీటిపై మూత పెట్టి మరో రెండు నిమిషాల పాటు వేయించాలి.

తర్వాత పచ్చికొబ్బరి తురుము వేసి కలపాలి. తర్వాత కొత్తమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.

ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీన్స్ ఫ్రై అవుతుంది.