షాహీ టుక్డా!

 

కావలసిన పదార్థాలు:

బ్రెడ్ స్లయిసెస్ - ఆరు
పాలు - ఒక లీటరు
చక్కెర - అరకప్పు
యాలకుల పొడి - అరచెంచా
తరిగిన బాదం - ఒక చెంచా
తరిగిన పిస్తా - ఒక చెంచా
కుంకుమపువ్వు  - చిటికెడు
నెయ్యి - వేయించడానికి సరిపడా

పాకం కోసం:

చక్కెర  - అరకప్పు
నీళ్లు  - అరకప్పు

తయారీ విధానం:

చక్కెరలో నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి. తీగ పాకం వచ్చే వరకూ మరిగించాలి. పాకం తయారయ్యే లోపు అడుగు మందంగా ఉన్న గిన్నెలో పాలు పోసి స్టౌ మీద పెట్టాలి. పాలు సగం అయ్యేవరకూ మరిగించాక చక్కెర, యాలకుల పొడి, కుంకుమపువ్వు వేసి కలపాలి. రబ్డీ చిక్కగా అయ్యేవరకూ సన్నని మంటమీద ఉడికించి దించేయాలి. బ్రెడ్ స్లయిసెస్ ని త్రిభుజాకారంలో కట్ చేసుకోవాలి. స్టౌ మీద కడాయి పెట్టి నెయ్యి వేయాలి. వేడెక్కాక బ్రెడ్ స్లయిసెస్ వేసి ఎరుపు రంగు వచ్చేవరకూ వేయించాలి. తరువాత తీసేసి పేపర్ టవల్ మీద వేయాలి. ఆపైన వీటన్నిటినీ చక్కెర పాకంలో ముంచి తీసి బౌల్ లో వేయాలి. ఆ తరువాత వీటి మీద రబ్డీని వేయాలి. స్లయిసెస్ బాగా నానిన తరువాత డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వు చల్లి సర్వ్ చేయాలి.

- Sameera