రోజ్ కుకీస్ 

 

 

కావలసినవి:


బియ్యం పిండి - రెండు కప్పులు
మైదా - నాలుగు కప్పులు 
గుడ్లు - రెండు 
చక్కెర - మూడు కప్పులు
యాలకులు - కొద్దిగా 
కొబ్బరిపాల కోసం - ఒక కొబ్బరి చిప్ప 

తయారుచేసే విధానం:


ముందుగా మైదా, గుడ్లు, పంచదార, బియ్యం పిండిను బాగా కలపాలి.

అయితే ఇది దోశలపిండిలా పలచగా ఉండటానికిగాను తగినంత కొబ్బరిపాలు కూడా కలపాలి. పిండి సిద్ధమైన తర్వాత రెండు స్టవ్‌లను వెలిగించి, ఒక బాణలిలో సగానికి పైగా నూనె పొయ్యాలి.

అలాగే మరో బాణలిలోపావువంతు నూనె పోసి అది బాగా వేడి అయిన తర్వాత దాంట్లో  రోజ్ కుకీస్ మోల్ ను ముంచి దాన్ని అలాగే కలిపి ఉంచుకున్న పిండి మిశ్రమంలో ముంచి, నూనె కాగుతున్న మరో బాణలిలో ముంచండి.

మోల్‌కున్న పిండి పువ్వులా విడివడుతుంది. వీటిని బంగారు వన్నె వచ్చేవరకు వేయించాలి. కరకరలాడుతూ తినడానికి బాగుండే ఈ రోజ్ కుకీస్‌ను చల్లగుత్తులు అని కూడా అంటారు.