ఆలూ 65

కావాల్సిన పదార్థాలు:

బంగాళా దుంప - 300 గ్రాములు

కార్న్‌ ఫ్లోర్ - 2 స్పూన్లు

శనగ పిండి- 2 స్పూన్లు

ఉప్పు - రుచికి తగినంత

కారం పొడి - 1/2 స్పూన్

కొత్తిమీర 1/2 కప్పు (సన్నగా తరిగినవి)

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీ స్పూన్

నూనె -వేయించడానికి

సాసింగ్ కోసం నూనె 2 - టేబుల్ స్పూన్లు

పెరుగు - 2 టేబుల్ స్పూన్లు

కార్న్‌ఫ్లోర్ - 1 స్పూన్

టమాటా సాస్ - అర టీస్పూన్

చిల్లీ సాస్ - అర టీ స్పూన్

ఎండు మిర్చి - 2

కరివేపాకు -15-20

వెల్లుల్లి -10 రెబ్బలు (సన్నగా తరిగినవి)

ఉప్పు - రుచికి తగినంత

తయారీ విధానం :

ఆలూ 65 తయారు చేయడానికి, ముందుగా బంగాళదుంపలను తొక్క తీసి పిండి మిశ్రమంగా చేసుకోండి.

బంగాళదుంప మిశ్రమంలో ఇప్పుడు మొక్కజొన్న పిండి, మైదా, ఉప్పు, కారం, కొత్తిమీర తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, ఈ పదార్థాలన్నింటినీ బాగా కలపండి.

చిన్న బంతులుగా వీటిని తయారు చేయండి. బాణలిలో నూనె వేసి అందులో బంగాళదుంప బాల్స్ వేసి వేయించాలి. మీడియం మంట మీద మాత్రమే వేయించాలి.

బంగాళాదుంప బాల్స్ బంగారు గోధుమ రంగులోకి మారిన అనంతరం, నూనె నుండి బయటకు తీయండి. అదే విధంగా అన్ని బంగాళాదుంప బాల్స్‌ను వేయించి సిద్ధం చేసుకోండి.

సాస్ తయారీ చేసే విధానం:-

ఆలూ 65 సాస్ చేయడానికి, ఒక పాన్ తీసుకొని, 2 స్పూన్ల నూనె వేసి వేడి చేసి, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకుని, అందులో నిర్ణీత పరిమాణంలో కార్న్‌ఫ్లోర్, చిల్లీ, టమాటా సాస్ కలపండి.

నూనె కాస్త వేడయ్యాక కరివేపాకు, వెల్లుల్లిపాయలతో పాటు రెండు ముక్కలుగా తరిగిన ఎండు మిరపకాయలు వేసి కలపాలి. మాడకుండా కొద్దిగా వేయించాలి.

ఇప్పుడు అందులో సిద్ధం చేసుకున్న పెరుగు వేసి కలపాలి, పావు కప్పు నీరు వేసి కొద్దిగా వేడి చేయాలి. ఇప్పుడు సాస్ సిద్ధంగా అవుతుంది.

ఇప్పుడు సిద్ధం చేసుకున్న సాస్‌లో పొటాటో బాల్స్‌ వేసి కలపాలి. 1-2 నిమిషాలు త్రిప్పుతూ ఉడికించి, స్టౌ ఆఫ్ చేయండి. ఆలూ 65 రెడీ అవుతుంది. టమాటా సాస్ తో రుచిని ఆస్వాదించండి.