పొంగలి

 

 

 

కావలసిన పదార్ధాలు :

పెసరపప్పు - ఒకటిన్నర గ్లాస్

బియ్యం - ఒక గ్లాస్

పచ్చిమిర్చి - రెండు

నెయ్యి - మూడు స్పూన్లు

మినపప్పు - ఒక టీ స్పూన్

జీల కర్ర- అర టీ స్పూన్

ఆవాలు - అర టీ స్పూన్

కరివేపాకు - తాలింపుకు సరిపడా

అల్లం :చిన్న ముక్క

ఎండుమిరపకాయ - ఒకటి

జీడిపప్పు - 50 గ్రాములు

ఉప్పు తగినంత

మిరియాలు - అర స్పూన్

సెనగపప్పు - రెండు టీ స్పూన్లు

 

తయారుచేయు విధానం :

ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టి బియ్యం, పెసరపప్పు,జీడిపప్పు, కట్ చేసుకున్న అల్లం తురుము సరిపడా నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టుకుని నెయ్యి వేసి అందులో తాలింపు దినుసులు అన్నిటిని వేసుకుని వేగాకా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని తాలింపులో వేయ్యాలి.