పెప్పర్ కార్న్ రైస్

 

 

 

రైస్ ఐటమ్స్ ఎన్నిచేసినా చేసే వాళ్ళకి బోర్ కొట్టదు, తినే వాళ్లు అంతకన్నా బోర్ ఫీల్ అవ్వరు. మిరియాలు ఒంటికి మంచివని అందరికి  తెలుసు కాని వాటితో ఎం చేస్తే బాగుంటుంది అంటే నేను పెప్పర్ కార్న్ రైస్ చేస్తే బాగుంటుంది అంటాను. మీరేమంటారు తయారు చేసే విధానం చూద్దామా.

 

కావాల్సిన  పదార్థాలు:

బాస్మతి రైస్ - 1 కప్పు
 మిరియాల పొడి - 2 స్పూన్స్
మొక్కజొన్న - 1//2 కప్పు
నెయ్యి - 2 స్పూన్స్
అజినోమోటో -  చిటికెడు
సోయాసాస్ - 1//2 స్పూన్
జీలకర్ర - 1 స్పూన్
ఉప్పు- రుచికి సరిపడా

 

తయారుచేయు విధానం:  

ముందుగా స్టవ్  వెలిగించి  పాన్ లో కొద్దిగా నూనె వేయాలి. తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర వేసి ఒక నిమిషం  వేయించుకోవాలి. అది వేగిన తర్వాత  మొక్కజొన్న గింజలు, మిరియాలపొడి, అజినమోటో, ఉప్పు, సోయాసాస్ వేసి రెండు మూడు నిముషాలు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ముందుగా వండి చల్లారబెట్టిన బాస్మతి రైస్ ను అందులో వేసి బాగా కలపాలి. కావాల్సిన వాళ్ళు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు.

 

..కళ్యాణి