పాకం గారెలు

 

 

 

 

కావలసినవి :

మినపప్పు - అర కేజీ
నూనె - పావు కేజీ
ఉప్పు - తగినంత
పంచదార - పావు కేజీ.
అల్లం ముక్కలు తరిగినవి - రెండు స్పూన్‌లు
జీలకర్ర - ఒక స్పూన్
కొత్తిమీర తురుము- ఒక కప్పు
ఉల్లిపాయ -  ఒకటి
పచ్చి మిర్చి - రెండు

 

 తయారీ :
ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో  సరిపడా నీళ్ళు పోసి పంచదార వేసి మరిగించి పాకం తాయారు చేసుకోవాలి. తరువాత నానపెట్టుకున్న మినపప్పుని కడిగి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. మిశ్రమం బాగా మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి. తరువాత అందులో ఉల్లిపాయలు, అల్లం, పచ్చి మిర్చి, జీలకర్ర, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక పాత్రలో నూనె వేసి వేడి అయ్యాక చేతిపై గారెల మాదిరిగా వత్తుకుంటూ నూనెలో వేసుకోవాలి. తరువాత ఆ గారెలను పంచదార పాకంలో వేయాలి. ఈ గారెలను వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి.