ఓట్స్ చపాతీ  రెసిపి

 

 

 

 

కావలసినవి :

ఓట్‌మీల్‌ పిండి - కప్పు 
గోధుమపిండి - కప్పు
సెనగపిండి - కప్పు
మెంతిపొడి - అరటీస్పూను 
నెయ్యి - తగినంత
ఉప్పు- తగినంత
జీలకర్ర పొడి - అరటీస్పూన్

 

తయారుచేసే విధానం :

ముందుగా ఓట్స్ పిండి, గోధుమ పిండి, సెనగ పిండి అన్నింటినీ కలిపి అందులో ఉప్పు, జీలకర్ర, మెంతిపొడి రెండు స్పూన్ల నెయ్యి గోరువెచ్చని నీళ్ళు వేసి చపాతీలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక  అర గంట నానిన తరువాత ఉండలు చేసుకుని చపాతీల్లా చేసి పెనం మీద  కాల్చాలి.  చివరలో చపాతీ మీద నెయ్యి రాసుకుంటే సరిపోతుంది. ఈ చపాతీ ని ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా కాని రాత్రీ డిన్నర్ లోకి కాని తీసుకోవచ్చు...