మొలకల మసాలా

 

 

 

 

కావలసినవి:

మొలకెత్తిన పెసలు - 150గ్రా
మిర్చి లేదా క్యాప్సికమ్ (ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో) - ఆరు
ఉల్లిపాయ    - ఒకటి
అల్లం        - చిన్నముక్క
వెల్లుల్లి        - రెండు రెబ్బలు
నూనె        - అర టీస్పూను
పంచదార    - చిటికెడు
ఉప్పు         - సరిపడా

 

తయారు చేయు విధానం :

 

మూడు రంగుల మిరపకాయలు లేదా క్యాప్సికమ్ ని, ఉల్లిపాయనీ సన్నని ముక్కలుగా కోయాలి. కోసేటప్పుడు వాటి మధ్యలో ఉన్న గింజల్ని తీసేయాలి. ఓ బాణలిలో నూనెవేసి అల్లంవెల్లుల్లి రెండు నిమిషాలు వేయించాలి. తరువాత మొలకెత్తిన పెసలు, పచ్చిమిర్చి ఉల్లిముక్కలు వేసి మరో రెండు నిమిషాలు వేయించాలి. చివరగా ఉప్పు, పంచదార కూడా వేసి గరిటెతో బాగా కలిపి దించాలి. ఇది వేడిగా ఉన్నప్పుడే తింటే రుచిగా ఉంటుంది.