మోదక్ ఖీర్

 

కావాల్సిన పదార్థాలు:

పాలు - 1.5 లీటర్ల

తాజా క్రీమ్ - 1/2 కప్పు

బియ్యం పిండి - 1 కప్పు

చక్కెర పొడి - 2 స్పూన్

పిస్తా - 2 టేబుల్ స్పూన్లు

యాలకుల పొడి - 1/2 టేబుల్ స్పూన్లు

తురిమిన కొబ్బరి - 2 టేబుల్ స్పూన్లు

కుంకుమపువ్వు - చిటికెడు

దేశీ నెయ్యి - 1 టేబుల్ స్పూన్

చక్కెర - 1/2 కప్పు

ఉప్పు - చిటికెడు

మోదక్ ఖీర్ తయారు చేసే విధానం:

మోదక్ ఖీర్ చేయడానికి, ముందుగా మిక్సింగ్ గిన్నెలో బియ్యప్పిండిని వేయాలి. దీని తర్వాత పిండిలో చిటికెడు ఉప్పు, దేశీ నెయ్యి వేయాలి. ఇప్పుడు నిదానంగా ఒక కప్పు నీళ్లు పోసి పిండిలో ఉండలు లేకుండా కలుపుతూ ఉండాలి. దీని తర్వాత పిండిలో పంచదార పొడి, యాలకుల పొడి వేసి కలపాలి. వేడి నీరు పోసి..రుచికి తీపిగా ఉండేవిధంగా పిండిని మెత్తగా చేయాలి. ఈ పిండిని కాసేపు పక్కన పెట్టండి.

- మీ అరచేతులపై నెయ్యిని అప్లై చేసి, పిండిని చిన్న చిన్న బంతుల వలే చేయండి. వాటిని ఒక ప్లేట్‌లో విడిగా ఉంచండి. డౌ బాల్స్ అన్నీ రెడీ అయ్యాక స్టీమర్ తీసుకుని అందులో బాల్స్ వేసి 8-10 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. మీకు స్టీమర్ లేకపోతే, మీరు దీని కోసం కుక్కర్‌ను కూడా ఉపయోగించవచ్చు.

ఇప్పుడు ఒక పాత్రలో పాలు పోసి మీడియం మంట మీద వేడి చేయాలి. పాలు వేడెక్కుతున్నప్పుడు, కలుపుతుండాలి. పాలు ఉడికి చిక్కగా అయ్యాక గ్యాస్ మంటను తగ్గించి అరకప్పు పంచదార, యాలకుల పొడి, మీగడ, కుంకుమపువ్వు వేసి బాగా కలపాలి. దీని తరువాత, పాలలో ఉడికించిన బాల్స్ వేసి మూతపెట్టి ఉడికించాలి. 5-7 నిమిషాలలో డౌ బాల్స్ మెత్తగా మారుతాయి. ఖీర్ క్రీమీగా మారుతుంది. దీని తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. మోదక్ ఖీర్ వినాయకుడికి సమర్పించడానికి సిద్ధంగా ఉంది. నైవేద్యం సమర్పించే ముందు పిస్తాతో అలంకరించండి.