మిక్స్‌డ్ వెజిటెబుల్ ఉప్మా

 

 

 

కావలసిన పదార్థాలు:- 
బొంబాయి రవ్వ - 2 కప్పులు
ఉల్లిపాయ - 1
టొమాటో - 1 
క్యారెట్ -1
ఉప్పు - తగినంత
అల్లం ముక్క - చిన్నది
కరివేపాకు -1 రెమ్మ
నెయ్యి -1 చెంచా
కాలీఫ్లవర్ ముక్కలు -పావు కప్పు 
బంగాళాదుంప - 1
శెనగపప్పు -1 స్పూన్
మినప్పుప్పు - అర స్పూన్
మిరియాల పొడి- 1 స్పూన్
పచ్చిమిర్చి - 3
ఆవాలు - 1 స్పూన్

తయారీ విధానం:-
ముందు కూరగాయలను ఉడికించుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో నెయ్యి వేడి చేసి మినప్పుప్పు, శెనగపప్పు,ఆవాలు , కరివేపాకు వేయాలి. వేగాక ఉల్లిపాయ ముక్కలు, చిన్న ముక్కలు గా కట్ చేసిన అల్లం,టొమాటో, పచ్చిమిర్చి ముక్కలను వేగాక కూరగాయ ముక్కలను వేసి కొద్దిసేపు వేయించి సరిపడా నీళ్ళు, ఉప్పు, మిరియాల పొడి వేసి ఉడికించాలి నీళ్ళు మరుగుతుండగా ఉప్మా రవ్వ వేసి ఉండలు కట్టకుండా గరిటతో కలపాలి. ఉప్మా రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి..