మిక్స్‌డ్ వెజిటేబుల్ పకోడీ

 

 

 

కావలసినవి:
శనగపిండి - ఒక కప్పు
నూనె - తగినంత
ఉప్పు - తగినంత,
ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు
క్యాబేజి తరుగు - ఒక కప్పు
పాలకూర తరుగు- ఒక కప్పు
కాలిఫ్లవర్‌ - ఒకటి
పచ్చిమిర్చి - రెండు
బంగాళాదుంప - ఒకటి,
జీలకర్ర పొడి - ఒక స్పూన్‌

 

తయారీ:
ముందుగా బంగాళాదుంపలను ఉడికించి చెక్కు తీసి మెత్తగా చేసుకోవాలి. తరువాత కాలిఫ్లవర్‌, క్యాబేజిలను విడి విడిగా నీళ్ళలో ఐదు నిముషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత శనగపిండిలో కట్ చేసుకున్నపాలకూర, ఉల్లిపాయలు, చిదిమిన బంగాళాదుంప, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి, ఉప్పు రెండు టీ స్పూన్ల నూనె, సరిపడా నీళ్ళు వేసి  బాగా మిక్స్ చెయ్యాలి. తరువాత  మూకుడు పెట్టి ఆయిల్ వేసి కాగాక ఈ పిండిని పకోడీల్లా వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించి  తీసి ప్లేట్ తీసి ప్లేట్ లో పెట్టుకుని సాస్ తో కాని గ్రీన్ చట్నితో కాని సర్వ్ చేసుకోవాలి కరకరలాడే వెజిటబుల్‌ పకోడీ మీ ముందుంటుంది.