మిల్క్ స్వీట్ రెసిపి

 

 

 

కావలసిన వస్తువులు:

పాలు - అర లీటర్

పంచదార  - 300 గ్రాములు

బొంబాయి రవ్వ  -  150 గ్రాములు

నెయ్యి  -  అర కేజీ

జీడి పప్పు,కిస్‌మిస్ -  తగినన్ని

 

తయారు చేసే విధానం:

ముందుగా  స్టవ్ వెలిగించి  పంచదార,పాలు, బొంబాయిరవ్వ, నెయ్యి అన్నీ కలిపి ఒక గిన్నెలో వేసి చిన్న మంట పెట్టి పాకం వచ్చేవరకు తిప్పుతూ ఉండాలి.  

నెయ్యి పైకి తేలాక నెయ్యి రాసిన ప్లేట్ లో వేసి పైన వేయించుకున్నజీడిపప్పు, కిస్‌మిస్ వేసి చల్లార్చాలి. చల్లరకా మనకి నచ్చిన సైజ్ లో కట్ చేసుకోవాలి.