రాగి లడ్డు

 

 

 

కావలసిన పదార్ధాలు:

మొలకెత్తిన రాగుల పిండి - ఒక కప్పు

ఎండు కొబ్బరి ముక్కలు - పావు కప్పు ( సన్నగా తరిగినవి)

ఏలకుల పొడి - పావు టీ స్పూను

బెల్లం పొడి - అర కప్పు

నెయ్యి - రెండు టేబుల్‌ స్పూన్లు

మరిగించిన పాలు - పావు కప్పు

జీడి పప్పులు - 10 (చిన్న చిన్న ముక్కలు చేయాలి)

బాదం పప్పులు - 10 (చిన్న చిన్న ముక్కలు చేయాలి)

ఎండు కొబ్బరి తురుము - అలంకరించడానికి తగినన్ని

 

తయారుచేసే విధానం:

స్టౌ మీద బాణలిలో ఒక గిన్నెలో నెయ్యి వేసి బాగా కాగిన తరవాత జీడి పప్పు పలుకులు, బాదం పలుకులు వేసి లేత గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి. రాగి పిండి జత చేసి మరోమారు దోరగా వేయించాలి. బెల్లం పొడి, ఏలకుల పొడి, ఎండు కొబ్బరి తురుము జత చేసి మరోమారు వేయించాలి. వేడి పాలు జత చేసి కలియబెట్టాలి. మంట తగ్గించి, గిన్నె మీద మూత పెట్టాలి. రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచి, దింపేయాలి. ఎండు కొబ్బరి ముక్కలు జత చేస్తూ, కావలసినంత పరిమాణంలో ఉండలుగా చుట్టుకోవాలి.