ఎగ్ కుర్మా

 

 

కావలసినవి:

కోడిగుడ్లు - 4

ఉల్లిపాయలు - 2

టొమాటో - 2

ధనియాలపొడి - టీ స్పూన్

ఉప్పు - సరిపడా

కరివేపాకు - రెండు రెబ్బలు

అల్లం, వెల్లుల్లి ముద్ద - టీ స్పూన్

కారం - టీ స్పూన్

పసుపు - పావు టీ స్పూన్

గసగసాలు - టీ స్పూన్

దాల్చినచెక్క - 1

లవంగాలు - 3

ఏలకులు - 2

జీడిపప్పు - 10

పుదీనా - కొన్ని ఆకులు

నూనె - సరిపడగా

కొత్తిమీర - గార్నిష్‌కి

సోంపు - అర టీ స్పూన్

 

తయారీ విధానం:
ముందుగా కోడిగుడ్లను ఉడకబెట్టి పైన పెంకు తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయలువేసి రంగు వచ్చేవరకు వేయించి, అల్లం, వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, పుదీనా వేసి వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి , టొమాటో ముక్కలు వేసి 5 నిమిషాలు వేయించాలి. ఇప్పుడు మసాలా దినుసులన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి... ఈ మసాలా ముద్ద ను కూడా వేసి కలుపుతూ 10 నిమిషాలు ఉడికించాలి. తరువాత కోడిగుడ్లు వేసి అయిదు నిమిషాలు వుంచాకా సరిపడా నీళ్ళు వేసి మూతపెట్టాలి. గ్రేవీ కొంచం చిక్కగా అయ్యాక స్టవ్ మీదనుంచి దించేసి కొత్తిమిర వేసుకోవాలి.