పెప్పర్ ఫ్రాన్స్ ఫ్రై

 

కావాల్సిన పదార్ధాలు:

రొయ్యలు - 1/2 కేజీ

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు - 1టేబుల్ స్పూన్

మినియాలు -1 టేబుల్ స్పూన్

జీలకర్ర - 1 టేబుల్ స్పూన్

సోంపు - 1 టేబుల్ స్పూన్

దాచ్చిన చెక్క - ఒక అంగుళం

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 కప్పు

నూనె- వేయించడానికి సరిపడా

గరం మసాలా - 1 టేబుల్ స్పూన్

కరివేపాకు - కాస్తంత

ఉల్లిపాయ తరుగు -1 కప్పు

పచ్చిమిర్చి- పేస్టు

కారం-1 టేబుల్ స్పూన్

తయారీ విధానం:

-ముందుగా రొయ్యలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. నీరు పూర్తిగా పోయిన తర్వాత అందులో కాస్తా ఉప్పు , పసుపు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు మిరియాలు, జీలకర్ర కలిపి పోడిచేయాలి. ఒక బాణాలిలో కొంచెం నూనె వేసి తాలింపు దినుసులతో తాలింపు వేయాలి. తర్వాత ఉల్లిపాయ తరుగు వేసి వేయించాలి.

-తర్వాత అల్లంవెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి బాగా వేయించాలి. ఇప్పుడు కారం, జీలకర్ర పొడి, గరం మసాలా కొద్దిగా పసుపు వేసి కలపాలి. తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న రొయ్యలు వేసి పావు కప్పు నీళ్లు పోయాలి.

-జ్యూసీగా కాకుండా పొడిపొడి గా ఉండే విధంగా చూసుకోవాలి. ముక్క బాగా ఉడికి దగ్గర పడిన తర్వాత మరో గిన్నెలో సర్వ్ చేసుకోవాలి. అంతే సింపుల్ పెప్పర్ ప్రాన్స్ ఫ్రై రెడీ.